- ఘనంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ బర్త్ డే
వేద న్యూస్, వరంగల్:
ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలను నిర్వహించడం జనసేన కార్యకర్తలు, నాయకులు గర్వించదగ్గ విషయం అని ఆ పార్టీ నర్సంపేట నియోజకవర్గ ఇన్ చార్జి మేరుగు శివకోటి యాదవ్ అన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. భావితరం, దేశం గర్వించదగ్గ నాయకుడు పవన్ కల్యాణ్ అని వెల్లడించారు.
ఏపీ డిప్యూటీ సీఎం జన్మదిన వేడుకలను సోమవారం నర్సంపేట పట్టణంలోని ద్వారకపేట్ రోడ్‌లో గల జనసేన పార్టీ ఆఫీసులో శివకోటి యాదవ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు, ముఖ్య నేతల సమక్షంలో చిన్నారులతో కేక్ కట్ చేయించి పవన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కార్యకర్తలకు విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జనసేన ముఖ్య నేతలు ఓర్సు రాజేందర్,గంగుల రంజిత్, బొబ్బ పృథ్వీరాజ్, ఉడుగుల క్రాంతి, షేక్ హుస్సేన్,అరుణ్, కృష్ణ,కార్తీక్,లహరి, మిలాన్,నాగరాజు, రవి,కుమార్,రాజు, ముబీన్, వివిధ గ్రామాల జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.