• పారిశుధ్య పనులను పరిశీలించిన ‘ప్రత్యేక’ అధికారి

వేద న్యూస్, హన్మకొండ:
తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకొని ఒగ్లాపూర్ గ్రామ పంచాయతీలో ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల స్పెషల్ ఆఫీసర్ బాలరాజు హాజరయ్యారు.

అనంతరం ఆయన గ్రామంలో జరుగుతున్న పారిశుధ్య పనులను పరిశీలించారు.
కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఇంజపెల్లి నరేష్, మాజీ ఎంపీటీసీ సభ్యులు శ్రీలత రాధాకృష్ణ, ఫీల్డ్ అసిస్టెంట్ శంకర్, అంగన్ వాడీ టీచర్, ఆశా కార్యకర్త, మహిళా సంఘాల వీవోఏ, సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.