వేద న్యూస్, ఎల్కతుర్తి:
ఎల్కతుర్తి మండల పరిధిలోని పలు గ్రామాల్లో గురువారం ఓటింగ్ సరళిని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి బొమ్మ జయశ్రీ పరిశీలించారు. బీజేపీ హుస్నాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి తరఫున ఆమె బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలను కలిసి ఓటింగ్ జరుగుతున్న తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. కమలం పార్టీ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు కుడితాడి చిరంజీవి, నాయకులు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.