- జేడీఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి
వేద న్యూస్, జమ్మికుంట :
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేసే అభ్యర్థినే ప్రజలు అధిక మెజారిటీతో గెలిపించాలని జనతాదళ్ ( సెక్యులర్ ) పార్టీ జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి పిలుపునిచ్చారు.
గురువారం నియోజకవర్గంలోని రహేమత్ నగర్ డివిజన్ లో వాసు వడ్లూరి మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవలో నిరంతరం పనిచేసే అభ్యర్థినే ప్రజలు అధిక మెజారిటీతో గెలిపించుకోవాలని చెప్పారు .
పార్టీలతో సంబంధం లేకుండా బాధ్యత గల అభ్యర్థిని మాత్రమే ఎన్నుకోవాలని నియోజకవర్గ ప్రజలను కోరారు.