వేద న్యూస్, హుజురాబాద్:
చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ భర్త గాలన్న ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న
జనతాదళ్( సెక్యులర్ )జేడీఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి నాయకులతో కలిసి వెళ్లి..బొడిగ శోభ కుటుంబ సభ్యులను గురువారం పరామర్శించారు. గాలన్న చిత్రపటానికి పూలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుడు మారముల్ల ఆనంద్, వీణవంక మండలం వల్బాపూర్ వార్డు సభ్యులు మార ముళ్ల కిరణ్ పాల్గొన్నారు.
