వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
యేసు క్రీస్తు అంటేనే ప్రేమను పంచడం అని వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ రామకృష్ణ అన్నారు. గురువారం ఆర్ట్స్ కళాశాల మైదానంలో పాస్టర్ ప్రవీణ్ బెల్లంపల్లి చేత ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి హజరయ్యారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ రామకృష్ణ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి , పాస్టర్ ప్రవీణ్ ను ఘనంగా సన్మానించారు.

అనంతరం డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ వరంగల్ కి రావడం చాలా సంతోషకరమని చెప్పారు. ఏసుక్రీస్తు గురించి పాస్టర్ ప్రవీణ్ ప్రజలకు అర్థం అయ్యేలా చెప్పారని అన్నారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రజల మనిషనీ, ప్రజల సమస్యల మీద పోరాడే వ్యక్తి అని పేర్కొన్నారు.

అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల ద్వారా లబ్ధి పొందాలని సూచించారు. రానున్న రోజుల్లో ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుందని డాక్టర్ రామకృష్ణ వెల్లడించారు. కార్యక్రమంలో పాస్టర్స్ జోసెఫ్, ప్రభాకర్, ఐసక్ కురియన్ తదితరులు పాల్గొన్నారు.