• యునైటెడ్ వే హైదరాబాద్ చాప్టర్ మేనేజర్ సుమన 

వేద న్యూస్, హైదరాబాద్/చార్మినార్:

కేవలం డిగ్రీ పట్టాతో ఉపాధి ఉద్యోగ అవకాశాలు పొందలేమని, తగిన ఉద్యోగ సంసిద్ధ నైపుణ్యాలను పెంపుదల చేసుకున్నప్పుడే మంచి ఉద్యోగాన్ని సంపాదించగలుగుతారని యునైటెడ్ వే హైదరాబాద్ చాప్టర్ మేనేజర్ సుమన బొమ్ము అన్నారు. ప్రభుత్వ సిటీ కళాశాల తెలంగాణ జ్ఞాన నైపుణ్యాల కేంద్రంతో కలసి డిగ్రీ తృతీయ సంవత్సరం విద్యార్థులకు ‘జాబ్ రెడీనెస్’ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమ ఈ కార్యక్రమ ప్రారంభ సభలో ఆమె అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఎన్జీవో ద్వారా దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాలలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, హైదరాబాద్ విభాగం నుండి నగరంలోని ప్రముఖ కళాశాలల విద్యార్థులకు వివిధ నైపుణ్యాలను అందిస్తామని చెప్పారు. సభకు అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పి.బాల భాస్కర్ మాట్లాడుతూ యునైటెడ్ వే సంస్థ సామాజిక స్పృహతో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని, తమ కళాశాలలో డిగ్రీ తృతీయ సం. విద్యార్థులంతా దశల వారీగా వారందించే శిక్షణ తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. డా.ఝాన్సీ సమన్వయం చేసిన సభలో డా.జె.నీరజ, డా.దయానంద్, అవంతి, సంతోష్, వెంకట స్వామి పాల్గొన్నారు. తొలిరోజు శిక్షణలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.