వేద న్యూస్, జమ్మికుంట:
ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ జమ్మికుంటలో చేరాలని ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.రాజశేఖర్ విద్యార్థులకు సూచించారు. మంగళవారం ఆయన ప్రభుత్వ జూనియర్ కళాశాల వీణవంక, మోడల్ స్కూల్ గన్ముకుల కళాశాల విద్యార్థులను..కాలేజీ అధ్యాపకులతో వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ జమ్మికుంటలో అన్ని వసతులు ఉన్నాయని, ఉన్నత విద్యను అభ్యసించిన అధ్యాపకులు కళాశాలలో ఉన్నందున ఈ కాలేజీలో చేరి మీ భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు.
అలాగే కళాశాలలోని టీఎస్ కేసీ ద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్ అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. ఎన్ఎస్ఎస్, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయని పేర్కొన్నారు. కళాశాలలో బిఏహెచ్.ఇ.పి, బీఏ ఆఫీస్ మేనేజ్ మెంట్, బీకాం కంప్యూటర్ అప్లికేషన్, బిఎస్సి డైరీ, బిఎస్సి క్రాఫ్ ప్రొడక్షన్, బిఎస్సి బి. జెడ్. సి, బి ఎస్ సి బి.జెడ్.సి.ఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయని వివరించారు.
ఈ కోర్సుల్లో చేరే విద్యార్థులు దోస్త్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని దోస్త్ లిస్టు పెట్టిన తర్వాత సర్టిఫికెట్లతో కళాశాలలో చేరాలని విద్యార్థులకు మార్గనిర్దేశనం చేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ ఎం.రామ్మోహన్ రావు, రేణ ఈశ్వరయ్య, వి స్వరూప రాణి, ఎల్.రవీందర్ తదితరులు పాల్గొన్నారు.