వేద న్యూస్, జడ్చర్ల:

బీఆర్ఎస్ పార్టీ జడ్చర్ల ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి సమక్షంలో శుక్రవారం జడ్చర్ల మండలంలోని ఉదండపుర్ గ్రామానికి చెందిన యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీజేపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరిన వారికి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి బిఆర్ఎస్ కండువా కప్పి వారిని పార్టీలోకి సాదరంగా  ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ.. బిఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మారెడ్డికి పూర్తి మద్దతునిస్తూ..కారు గుర్తుకు ఓటువేసి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజారిటీ తో గెలిపిస్తామని తెలిపారు.