- ఆ పార్టీ అభ్యర్థి మనోహర్ రెడ్డి సమక్షంలో
వేద న్యూస్, సుల్తానాబాద్:
సుల్తానాబాద్ మండలం తొగర్రాయి గ్రామానికి చెందిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ కే డి సి సి బి కే డైరెక్టర్ చింతల లింగారెడ్డి..పెద్దపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్రంలో మరోసారి రాబోయేది బీఆర్ఎస్ పార్టీ సర్కారేనని ఈ సందర్భంగా నాయకులు ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ అధ్యక్షులు పురం ప్రేమ్ చందర్ రావు, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బుర్ర మౌనిక – శ్రీనివాస్, మాజీ సర్పంచ్ లు సత్యనారాయణ రావు, పోచమల్లు, డైరెక్టర్ వల్స నీలయ్య తదితరులు పాల్గొన్నారు.