వేద న్యూస్, ఎలిగేడు:
పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సమక్షంలో ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామం నుంచి ఇతర పార్టీకి చెందిన యువకులు భారీ సంఖ్యలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన కార్యకర్తలకు పార్టీ కండువా కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఎమ్మెల్యే ఆహ్వానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన యువత కేసీఆర్ ప్రభుత్వం వైపు చూస్తున్నట్టు మనోహర్ రెడ్డి ఆదివారం పేర్కొన్నాడు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో సాయి, అనిల్, శ్రీకాంత్, వివేక్ ,సందీప్,రంజిత్ తదితరులున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎల్లయ్య, పెద్దపల్లి మండల అధ్యక్షుడు విక్రమ్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
