వేద న్యూస్, ఎలిగేడు:
పెద్దపల్లి జిల్లాలో కేటీఆర్ పర్యటన నేపథ్యంలో అన్ని మండలాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరయ్యాయి. ఆదివారం జరిగిన సభలో మంత్రి కేటీఆర్ ఓదెల మండలం నుంచి కొలనురును మండలకేంద్రంగా ప్రకటిస్తామని చెప్పడం పట్ల హరిపురం గ్రామ సర్పంచ్ మధు యాదవ్ హర్షం వ్యక్తం చేశారు.

అలాగే పెద్దపల్లికి బస్ డిపో ను కూడా మంజూరు చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఎలిగేడు మండల చిరకాల వాంఛ అయిన లాలపల్లి- పెద్దపల్లి రూట్ కు బస్ ను నడిపించాలని మండల ప్రజలు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఎలిగేడు మండలం నుంచి కేటీఆర్ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరైనందుకు మండల నాయకులు శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు.