వేద న్యూస్, వరంగల్ :

కోవిడ్‌ మహమ్మారి వ్యాప్తి చెందిన సమయంలో జర్నలిస్టులకు రద్దు చేసిన రైల్వే రాయితీ పాసులను వెంటనే పునరుద్ధరించాలని టీఎస్ జేయూ (తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్,వరంగల్ జిల్లా అధ్యక్షుడు కందికొండ మోహన్ యూనియన్ సభ్యులతో కలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని కోరారు. ఆదివారం నల్గొండ, ఖమ్మం, వరంగల్, ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరానికి వచ్చిన కిషన్ రెడ్డిని టీఎస్ జేయూ నాయకుల ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన జర్నలిస్టులందరికీ రైల్వే శాఖ రాయితీ పాసులను పునః ప్రారంభించాలని వినతి పత్రంలో కోరారు. కోవిడ్‌ మహమ్మారి వ్యాప్తి చెందిన సమయంలో రైల్వే మంత్రిత్వ శాఖ జర్నలిస్టులకు రాయితీ పాసులను రద్దు చేసినప్పటి నుంచి ఎక్రిడేటెడ్‌ జర్నలిస్టులందరూ వార్తలు, కథనాలు, తదితర ప్రెస్‌ సంబంధిత పనుల కోసం సొంత ఖర్చులతో ప్రయాణాలు చేస్తున్నారని స్పష్టం చేశారు. అంతేకాకుండా రైలులో ప్రయాణం చేసేటప్పుడు అదనపు మద్దతు అవసరమయ్యే కొన్ని వర్గాల ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగుపరచవలసిన అవసరం ఉందని ఆ లేఖలో మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధులుగా పనిచేసే జర్నలిస్టులకు తక్షణమే రైల్వే శాఖ రాతిపాసులను నా ప్రారంభించేలా ప్రత్యేక దృష్టి సాధించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కోరారు.ఈ కార్యక్రమంలో టీఎస్ జేయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు కందికొండ మోహన్, ప్రధాన కార్యదర్శి ఆవునూరి కుమారస్వామి, ఉపాధ్యక్షులు బత్తుల సత్యం, కందికొండ గంగరాజు, నీరుటి శ్రీహరి, మంచోజు హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.