వేద న్యూస్, ఖమ్మం :

మహబూబ్‌నగర్‌లో ఈ నెల 5 నుంచి నుంచి ప్రారంభమయ్యే జూనియర్ బాలుర తెలంగాణ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఖమ్మం జిల్లా జట్టు సిద్ధమైంది. ఈ నెల 5 నుంచి 7 వరకు జరిగే ఈ పోటీల్లో పాల్గొననున్న ఖమ్మం జట్టుకు తుంబూరు దయాకర్ రెడ్డి ప్రత్యేకంగా కబడ్డీ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ ఖమ్మం జట్టు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన చేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఎక్కువమంది యువ క్రీడాకారులు ఎంపికయ్యేలా శ్రమించాలని సూచించారు. జట్టుకు మెరుగైన సాధన కోసం మ్యట్‌ను కూడా ఏర్పాటు చేస్తామని దయాకర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కటికల క్రిస్టాఫర్ బాబు తదితరులు పాల్గొన్నారు.