Oplus_16777216

 

  •  హస్తం పార్టీ నాయకులు రేణుక శివకుమార్ గౌడ్

వేద న్యూస్, జమ్మికుంట:

కాంగ్రెస్ తోనే బలహీన వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు పూదరి రేణుక శివకుమార్ గౌడ్ పేర్కొన్నారు. బలహీన వర్గాల పక్షాన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలుకు క్యాబినెట్ ఆమోదం హర్షనీయం అని అభిప్రాయపడ్డారు.

బీసీల సామాజిక న్యాయానికి ఆది నుంచి పోరాడి..42 శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్ల ఎన్నికల్లో అమలు అయ్యేలా.. క్యాబినెట్లో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ముఖ్యపాత్ర పోషించిన బలహీన వర్గాల బలమైన నాయకుడిగా పొన్నం ప్రభాకర్ పేరు చరిత్రలో నిలుస్తుందనీ స్పష్టం చేశారు.