వేద న్యూస్, కరీమాబాద్:
గ్రేటర్ వరంగల్ 40వ డివిజన్ పరిధిలోని కరీమాబాద్ ప్రాంతంలో
విష సర్పాల బెడద ఎక్కువ అయ్యింది.
ప్రతి రోజు చుట్టూ ప్రక్కల ప్రాంతంలోని ఎవరొక్కరి ఇంట్లో పాములు కనిపిస్తూనే ఉన్నాయి. దీంతో స్థానికులు భయందోళనకు గురికాకతప్పడం లేదు. బుధవారం కరీమాబాద్ లోని ఓ వ్యక్తి ఇంట్లో ఓ పాము చొరబడి దాదాపు 2 గంటల పాటు అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. స్నేక్ క్యాచర్స్ వచ్చి ఆ పాము పట్టుకు వెళ్లే వరకు స్థానికులలో భయం పోలేదు.