వేద న్యూస్, కరీమాబాద్ :

తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం కరీమాబాద్ శాఖ కార్యవర్గన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కరీమాబాద్ అంబేద్కర్ భవన్ వద్ద మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి అంబేద్కర్ యువజన సంఘం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బొమ్మల అంబేద్కర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
అధ్యక్షులుగా జక్కుల రాజు, ప్రధాన కార్యదర్శిగా తరాల రవితేజ, కోశాధికారిగా బొమ్మల రాంప్రసాద్, లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం
జయంతి కార్యక్రమాల ఏర్పాటు విషయమై చర్చించి
రాబోయే జయంతి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని తీర్మానం చేశారు. ఈ సమావేశంలో భవన కమిటీ అధ్యక్షులు నీలం మల్లేశం, వార్డు పెద్దమనిషి కడారి కుమార్,మహిళా నాయకురాలు తరాల రాజమణి,బత్తుల రమేష్ బాబు,గాలి రాజు,ఎలుక సిద్ధార్థ, మగ్గిడి సుధాకర్,నీలం కిరణ్,నీలం రాజు,ఒంటెల సురేష్,ఒగ్గుల నరేష్,ఎరుకల సాయి,గాలి నవీన్, వినోద్,చింటూ తదితరులు పాల్గొన్నారు.