యువజన సంఘం జిల్లా అధ్యక్షులు అశోక్‌బాబు

వేద న్యూస్, వరంగల్ :

వరంగల్‌ పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 16న(ఆదివారం)ఖిలావరంగల్‌ సమీపంలోని చింతల్‌ వాకింగ్‌ మైదానంలో నిర్వహిస్తున్న పద్మశాలీ కార్తీక మాస వనభోజన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వరంగల్‌ పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు బేతి అశోక్‌ బాబు పిలుపు నిచ్చారు. శుక్రవారం అశోక్‌ బాబు అధ్యక్షతన కాశిబుగ్గలోని ప్రైవేటు పంక్షన్‌హాల్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాల నుండి
పద్మశాలీ కార్తీక మాస వనభోజన కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామన్నారు. ఈకార్యక్రమంలో గణపతి, శివ, ఉసిరి చెట్టుకు పూజా కార్యక్రమంతో పాటు మార్కండేయుని పఠనం ఉంటుందన్నారు. అనంతరం సంస్కృతి కార్యక్రమాలు, ముఖ్య అతిథుల ప్రసంగాలు, సన్మానం కార్యక్రమాలు ఉంటాయన్నారు. పద్మశాలి కుల బాంధవులు, డాక్టర్స్, ప్రొఫెసర్లు, లాయర్లు, ఇంజనీర్స్, ప్రభుత్వ అధికారులు, వ్యాపారస్తులు, చేనేత కార్మికులు, చేనేత సంఘాలు, కుల బంధువులు కుటుంబ సమేతంగా జిల్లా నలుమూలల నుంచి వేలాది మందిగా తరలి వచ్చి పద్మశాలీల ఐక్యత చాటాలని కోరారు. సాయంత్రం ఐదు గంటలకు జరిగే దీపోత్సవంతో కార్యక్రమం ముగుస్తుందన్నారు. ఈసమావేశంలో జిల్లా అధ్యక్షులు డాక్టర్‌ ఆడెపు రవీందర్, కో ఆర్డినేటర్‌ వడ్నాల నరేందర్, పద్మశాలీ సంఘాల నాయకులు కుసుమ సతీష్, డీఎస్‌.మూర్తి, గోరంటల రాజు, వి.సూర్యనారాయణ, ఎన్‌.చందర్‌బాబు, బి.శ్యామ్, యం.యెల్లయ్య, బి.శ్రీనివాస్, కె.క్రాంతికుమార్, ఎ.వెంకటేష్, గోరంటల మనోహర్, కె.సంగీత్, జి.కామేశ్వర్, బి.మురళీకృష్ణ, రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.