వేద న్యూస్, ఎలిగేడు:
ఎలిగేడు మండలవ్యాప్తంగా కేసీఆర్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. శనివారం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలలో నాయకులు పాల్గొని కేకులు కట్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు లాల పల్లి గ్రామంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో రైతులకు చాలా మేలు జరిగిందని తెలిపారు. అన్ని రకాల ప్రజలకు వివిధ రూపకంగా సహాయం అందిందని వెల్లడించారు. బర్త్ డే కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ రెడ్డి, రాజేశం, తిరుపతి రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, జగన్ , మల్లేశం, లచ్చిరెడ్డి, ఢిల్లేశ్వర్ రెడ్డి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.