భద్రకాళి అమ్మావారిని దర్శించుకున్న మంత్రి కొండా సురేఖ
వేద న్యూస్, వరంగల్ టౌన్ :
శ్రీ భద్రకాళీ శాకాంబరీ నవరాత్రి మహోత్సవాల సందర్భంగా గురువారం అటవీ,పర్యావరణ,దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఓరుగల్లు భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో మంత్రి కొండా సురేఖ కి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి కొండా సురేఖ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని పూజించిన మంత్రి కొండా సురేఖ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో మరింత ముందుకు పోవాలని మంత్రి కొండా సురేఖ ప్రార్థించారు.