- కొండా గెలుపుపై ముందే చెప్పిన “వేద న్యూస్” తెలుగు దినపత్రిక
- “తూర్పున కొండా పవనాలు” శీర్షికన కథనం ప్రచురితం
- కొండా గెలుపు కోసం కృషి చేసిన నవీన్ రాజ్
- యువతలో జోష్ నింపుతూ ప్రచారం చేసిన కొండా సుష్మిత పటేల్
- స్టిట్టింగ్ ఎమ్మెల్యే వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ముందుకు సాగిన కొండా సురేఖ
- కొందరు బీఆర్ఎస్ నేతల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రతీ ఒక్కరిలో ధైర్యం నింపిన మురళీధర్ రావు
- కాంగ్రెస్, కొండా గెలుపు కోసం ప్రాణాలను సైతం త్యాగం చేస్తామంటూ ముందుకు సాగిన యువ కార్యకర్తలు, అభిమానులు
వేద న్యూస్, వరంగల్:
వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖ తన సమీప ప్రత్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావు పై విజయం సాధించారు. అధికారులు ఆమెకు ఆదివారం ఎమ్మెల్యేగా గెలిచినట్లు ధ్రువీకరణ పత్రం అందజేశారు. కాగా, కొండా సురేఖ గెలుపు గురించి ‘‘వేద న్యూస్’’ తెలుగు దినపత్రిక ముందే చెప్పంది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడబోతోందనే విషయాన్ని ముందే అంచనా వేసి తెలిపింది. ‘తూర్పున కొండా పవనాలు’ శీర్షికన ‘‘వేద న్యూస్’’ తెలుగు దినపత్రిక ప్రచురించిన కథనం అక్షరాలా నిజమైంది. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు కష్టపడ్డారు. ముఖ్యంగా శ్రేణుల్లో కొండా సుష్మిత పటేల్ జోష్ నింపారు. సిట్టింగ్ ఎమ్మెల్యే వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టడంలో కొండా సురేఖ మురళీ ధర్ రావు దంపతులు సఫలీకృతులయ్యారు. ఫలితంగా తూర్పు గడ్డాపైన కాంగ్రెస్ జెండాను ఎగిరేశారు.