వేద న్యూస్, హన్మకొండ:
బీజేపీ ధర్మసాగర్ మండల ప్రధాన కార్యదర్శిగా మండల పరిధిలోని దేవునూరు గ్రామానికి చెందిన కొంగంటి సందీప్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా తనను మండల ప్రధాన కార్యదర్శిగా నియమించిన క్రమంలో సందీప్ శనివారం బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మా రెడ్డిని మర్యాదపూర్వకంగా ఆమె నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా రావుపద్మకు మొక్కను అందజేసి ధన్యవాదాలు తెలిపారు.

తనను మండల ప్రధాన కార్యదర్శిగా నియమించిన జిల్లా అధ్యక్షులు, ఆ పార్టీ ధర్మసాగర్ మండల అధ్యక్షుడు రాజు గౌడ్, జిల్లా నాయకుడు చిలుక విజయరావు, మాజీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, ఇతర నాయకులు, తోటి కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

బీజేపీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా సందీప్ పేర్కొన్నారు. దేశంలో మరోసారి రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనూ డబుల్ డిజిట్ సీట్లు బీజేపీ గెలుస్తుందన్నారు.