• బోయినిపల్లిలో ..

వేద న్యూస్,బోయినిపల్లి:

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలోని బోయినిపల్లి ప్రభుత్వ పాఠశాల వద్ద స్కూల్ అడ్డా యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయక విగ్రహం వద్ద ఆదివారం మహిళలు కుంకుమ పూజా కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి, గణనాధుని ఆశీస్సులు పొందారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గణనాథులు వద్ద ప్రత్యేక పూజలు చేశారు.

మండప నిర్వాహకులు మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా నిరంతరంగా ఈ వినాయక విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్నామని, ప్రతి సంవత్సరం భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని తెలిపారు.