వేద న్యూస్, వరంగల్ : 

గ్రేటర్ వరంగల్ 28 డివిజన్ లో పలు అభివృద్ధి పనులకు రూ.6 కోట్లతో డివిజన్ అధ్యక్షుడు కురిమిళ్ళ సంపత్ కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సంపత్ మాట్లాడుతూ డివిజన్లోని పలు సమస్యలపై రాష్ట్రమంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకుపోగా సానుకూలంగా స్పందించిన మంత్రి డివిజన్ అభివృద్ధి పనులకు నిధులను కేటాయించడం జరిగిందని అన్నారు. అందులో భాగంగానే కొండా దంపతులు ఆదేశాల మేరకు ఆదివారం రూ.6 కోట్లతో అభివృద్ధి పనులకు కొబ్బరి కాయ కొట్టడం జరిగిందన్నారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు వలబోజు శ్రీనాథ్,రానా సింగ్,బట్టు కృష్ణ ,మాటేటి నవీన్,ఓరుగంటి హేమంత్,మడిపోజు రాజు,సాయిలు,గట్టు శ్రీను, డివిజన్ మహిళా అధ్యక్షురాలు వడ్లకొండ ప్రవళిక,గట్టు రేఖ,భారతపు మమత కాలనీవాసులు కొండా అభిమానులు పాల్గొన్నారు.