• జమ్మికుంట బొమ్మలగుడిలో..
  • సకాలంలో వర్షాలు కురవాలని.., కరువు కాటకాలు పోవాలని కోరుతూ..
  • అన్నపూర్ణసేవా సమతి,భవానీ భజన మండలి భక్తుల పారాయణం

వేద న్యూస్, జమ్మికుంట:

 

జమ్మికుంట పట్టణంలోని బొమ్మల గుడి శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో సకాలంలో వర్షాలు కురవాలని, కరువు కాటకాలు పోవాలని శ్రీ అన్నపూర్ణావిశాలక్ష్మి అమ్మ వార్లకు 15 పర్యాయాలు శ్రీ లలితా సహస్రనామ పారాయణం ఉదయం 08:30 గంటలకు  ప్రారం భించి మధ్యాహ్నం 02:30 గంటల వరకు పారాయణం చేశారు.

కార్యక్రమంలో అన్నపూర్ణ సేవా సమితి వారు భవానీ భజన మండలి భక్తులు పాల్గొన్నారు. తదనంతరము ఆలయ ప్రధాన అర్చకులుమండలేముల వేణుగోపాల్ శర్మ తీర్థ ప్రసాదం వితరణ  చేశారు.

 

అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.