వేద న్యూస్,మిర్యాలగూడ ప్రతినిధి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండల పరిధిలోని చిలాపురం గ్రామానికి చెందిన బొడ్డుపల్లి లక్ష్మీనారాయణ (48) అనే వ్యక్తి ఎలక్ట్రిషన్ వృతి చేసుకుంటూ జీవనం సాగించేవాడు.ఆదివారం సరదాగా తన గ్రామస్తులతో కలిసి చిల్లాపురం గ్రామ శివారులోని చెరువు వద్ద చేపలు పట్టడానికి ఉదయం వెళ్లి చిల్లాపురం గ్రామ శివారులోని జానపాటి సైదులు యొక్క వ్యవసాయ భూమిలో గల విద్యుత్ మోటార్ స్టాటర్ కు ఉన్న వైరు ప్రమాదవశాత్తు తగిలి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. సదరు వ్యక్తిని మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది.మృతుని కుమారుడు బొడ్డుపల్లి మధు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతున్నది అని మిర్యాలగూడ రూరల్ ఎస్సై లక్ష్మయ్య తెలిపారు.