వేద న్యూస్, వరంగల్ టౌన్:
ములుగు రోడ్డులోని లాల్ బహదూర్ కళాశాల ఎన్సిసి 10వ తెలంగాణ బెటాలియన్ ఆధ్వర్యలో ‘స్వచ్ఛత హి సేవా’ ప్రోగ్రాం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ డి హెచ్ రావు తెలిపారు. ఆదివారం ఎన్సిసి క్యాడెట్స్ కళాశాల అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ నుండి భద్రకాళీ టెంపుల్ నుండి మత్తడి వరకు..‘స్వచ్ఛత హి సేవా’ నినాదాలు చేస్తూ ..బ్యానర్లను ప్రదర్శిస్తూ..ప్రజల్లో అవగాహన కల్పించే చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు.
ప్రజల్లో మార్పు తీసుకురావడానికి ఎన్సిసి క్యాడేట్స్ అందరిని ఆకర్షించే విధంగా పిరమిడ్లు వేశారు. వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, ఇతర ఆధికారులు, గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఎం రాజేష్ స్వచ్ఛ సర్వేక్షన్ గురించి అవేర్ నెస్ కల్పించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పెద్ద ఎత్తున క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాం నిర్వహించారు.
అలా ప్రజలను భాగస్వామ్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో భద్రకాళి టెంపుల్ కార్యనిర్వహణ అధికారి శశుభరతి, కెప్టెన్ డాక్టర్ ఎం. సదానందం, శశాంక్, అక్షయే, రాజు, పవను,రాము నాయక్, జూనియర్ అండ్ ఆఫీసర్, వినిత లక్ష్మి, ఎల్ ఇంద్ర, భరత్ ,నాగరాజ్, శివాని , సన్నిదా, నౌషిన్, నగేష్, సాయి కృష్ణ పాల్గొన్నారు.