వేద న్యూస్, మరిపెడ:
డోర్నకల్ నియోజకవర్గ పరిధిలోని మరిపెడ మండల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గులాబీ పార్టీ కార్యకర్తలతో విస్తృత సమావేశం శుక్రవారం నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, రాష్ట్ర బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి సీనియర్ నాయకులు నూకల నరేష్ రెడ్డి , సర్పంచ్ అభినవ రెడ్డి , మున్సిపాలిటీ చైర్ పర్సన్ సింధూర కుమారి , వైస్ చైర్మన్ ముదిరెడ్డి బుచ్చిరెడ్డి , మరిపెడ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి, నాయకులు మహేందర్ రెడ్డి, రాంలాల్ తదితరులు పాల్గొన్నారు. డోర్నకల్ ఎమ్మెల్యేగా రెడ్యా నాయక్ గెలుపునకు నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని నాయకులు పేర్కొన్నారు. బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఈ సందర్భంగా నేతలు ధీమా వ్యక్తం చేశారు.