వేద న్యూస్, మరిపెడ:

మరిపెడ ఉన్నత పాఠశాలలో మరిపెడ స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు అనంతరావు ఆధ్వర్యంలో ఆంగ్ల పాఠశాల సముదాయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లెర్నింగ్ ఇంప్రూవ్ మెంట్ ప్రోగ్రాం లో భాగంగా నిర్వహించిన బేస్ లైన్ టెస్ట్ పై రివ్యూ నిర్వహించారు.

ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థులందరికీ ఆంగ్లంలో మాట్లాడడం, చదవడం, రాయడం లో (ఐ ఎఫ్ పి) ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ ద్వారా ఉన్నతమైన శిక్షణ ఇవ్వాలని కోరారు. తదుపరి ఎల్టా (ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్) మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి , కాంప్లెక్స్ రిసోర్స్ పర్సన్ బయగాని రామ్మోహన్ ఉపాధ్యాయులందరికీ లర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా ఆంగ్ల విషయాలను విద్యార్థులకు ఎలా బోధించాలో, లర్నింగ్ అవుట్ కమ్స్ ఏ విధంగా సాధించాలో ప్రతి ఉపాధ్యాయుడి చేత ఇంటర్ ఆక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ ఉపయోగింపజేసి అర్థం చేయించారు.

 కార్యక్రమంలో నరసింహుల పేట, చిన్న గూడూరు, మరిపెడ మండలంలోని ఆంగ్ల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.