వేద న్యూస్, హైదరాబాద్: 

డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు డ్రగ్స్, మత్తు పదార్థాల పట్ల రాష్ట్ర ప్రజలను జాగృతం చేయాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లాలో నిర్వహించబోయే డ్రగ్స్ వ్యతిరేక ప్రచార కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ని రాష్ట్ర పౌర సమాచార మరియు రెవెన్యూ శాఖ మంత్రి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు పురుషోత్తం నారగోని, ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్, ములుగు జిల్లా అధ్యక్షుడు రాజు, వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు లింగబత్తిని కృష్ణ, శ్రీనాథ్, తదితరులు పాల్గొన్నారు.