స్వచ్ఛంద సంస్థలకు, మానవతావాదులకు, ప్రముఖులకు, పర్యావరణవేత్తలకు, ప్రకృతి ప్రేమికులకు అందరికీ మనవి. అగ్రి బయోడైవర్సిటీ నాశనానికి తీసుకున్న చర్యలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న అగ్రికల్చర్ విద్యార్థులకు సహకరించాలని పేరుపేరునా విజ్ఞప్తి.
ఎంతో గొప్ప చరిత్ర కలిగిన హైకోర్టు భవనాలను పురానాపూల్ నుండి ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ హైకోర్టు సముదాయాలను వ్యక్తుల ప్రయోజనం కోసం..ప్రభుత్వం తమ స్వార్థం కోసం ఎందరినో కష్టపెడుతూ ఇటు అడ్వకేట్లను గాని అటు కోర్టుకు వచ్చే వాళ్లను ఇబ్బంది పెడుతూ..చాలా దూరం ఉండి ఎంతో కఠినమైన వ్యయ ప్రయాణ ప్రయాసలకు గురిచేస్తూ, హైదరాబాద్ నుంచి రాజేంద్రనగర్ లో ఉన్న అగ్రి బయోడైవర్సిటీ పార్కుకు తరలించి అక్కడున్న అగ్రికల్చర్ యూనివర్సిటీ అస్తిత్వాన్ని నాశనం చేసేందుకు తీసుకొచ్చిన జీవో 55 ను నిర్వీర్యం చేయాలి. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్యమం పెద్ద ఎత్తున జరుగుతోంది.
దీని కిమనందరి సహాయ సహకారాలు ఉండాలని, మీరందరూ కూడా తమవంతగా ఏదో ఒక రోజు నిర్ణయించుకుని వారికి మళ్లీ ఒకసారి మద్దతు పలికి అక్కడ వారికి ధైర్యాన్ని ఇవ్వాలని కోరుతున్నారు. తద్వారా మన రాష్ట్రంలో ఉన్న ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీ దేశానికే అన్నపూర్ణ గా ఉంటుంది. కాబట్టి దాని అస్తిత్వాన్ని కాపాడుకొని, ప్రైవేటు వ్యక్తుల లేదా ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచనలను ఖండిస్తూ ఆ జీవో 55 ను వెనక్కి తీసుకోవాలని విన్నవిస్తున్నా. అందరూ ఈ విషయమై ముందుకు రావాలని, ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేయాలని కోరుకుంటున్నా.
అవసరానికి తగ్గట్టుగా అభివృద్ధిని ఎవరు కాదనలేము. అది నిజమే. కానీ, ఆల్రెడీ అభివృద్ధి చెందిన అగ్రికల్చర్ యూనివర్సిటీని, ఆ బయోడైవర్సిటీ ఈ పార్క్ ను నాశనం చేస్తూ అక్కడ ఒక్కొక్కరికి ఎకరాల చొప్పున ఇండ్లు కట్టించి అక్కడ ఒక ప్రత్యేకమైన అనవసరపు ఆహ్లదాన్ని స్వార్థపూరితంగా చేయాలని అనుకుంటున్నారు. అది సరికాదు. నిజంగా వారికి చిత్తశుద్ధి ఉంటే అదే హైకోర్టు భవనాలను అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఎదురుగా ఉన్న ప్రభుత్వ ఖాళీ భూములలో కట్టవచ్చు. ఈ ఆలోచనను అందరూ గమనించాలి..! ఎందుకంటే అభివృద్ధిని మనం కోరుకోవాలి. కానీ, అభివృద్ధి జరిగిన ప్లేస్ ను నాశనం చేసి మళ్లీ అభివృద్ధి చేయడమనేది ప్రజల సొమ్మును, అదేవిధంగా ప్రకృతి వనరులను నాశనం చేస్తున్నట్లే..
“ప్రభుత్వం జీవో నెం.55 నుంచి అగ్రి బయోడైవర్సిటీ పార్క్ రక్షించే విద్యార్థుల ఉద్యమానికి ఊపిరినిద్దాం”

– రవిబాబు పిట్టల, పర్యావరణ వేత్త, హైదరాబాద్.