•  స్నేహితుడి కుటుంబానికి రక్తం దానం చేసిన ముగ్గురు స్నేహితులు
  •  వరంగల్ నుంచి హైదారాబాద్ కి వెళ్లి ఇవ్వడం పట్ల పలువురి అభినందనలు 

వేద న్యూస్, వరంగల్ : 

రక్తదానం చేయడమంటే ఇతరుల ప్రాణాలను కాపాడటమే అని యువకులు లింగబత్తిని సుబ్రమణ్యం, శ్రీరామోజు మహేష్, మరుపట్ల అఖిల్ అన్నారు. శుక్రవారం తమ స్నేహితుడి భార్యకి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగింది. అందుకు అత్యవసరంగా 3 యూనిట్స్ రక్తం అవసరం అని తెలుసుకున్న ముగ్గురు స్నేహితులు వరంగల్ నుంచి సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ చేరుకొని రక్తదానం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదానం చేయడంలో యువకులు ప్రధాన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని, ఓటు హక్కు వచ్చిన ప్రతి ఒక్కరూ రక్తదానంలో పాల్గొంటే సమాజంలో రక్తం కొరత అనే మాట ఉత్పన్నం కాదనీ తెలిపారు.

రక్తం దానం చేసిన 8 రోజుల్లోనే శరీరంలో తిరిగి రక్తం తయారవుతుందని తెలిపారు. రక్త దానంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుని, అపోహలు తగ్గించుకుని రక్తదానం చేసేందుకు ముందుకు వస్తేనే రక్తం కొరత తీరి, ఎన్నో ప్రాణాలు నిలబడే అవకాశం ఉందని ఈ సందర్భంగా వారు తెలిపారు.