వేద న్యూస్,మిర్యాలగూడ ప్రతినిధి :
దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆటలాడుకోవడం సరికాదని వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ అందాల పోటీల ఏర్పాటుకు పైసలుంటాయి కానీ ఫీజు రీయంబర్స్మెంట్ కు పైసలుండవా అని లింగంగౌడ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.స్కాలర్షిప్స్,ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం అంటే పేద విద్యార్థులను విద్యకు దూరం చేసినట్టే అన్నారు.తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న రూ.8 వేల కోట్ల పైచిలుకు ఫీజు బకాయిలను విడుదల చేయాలని,లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యార్థి యువజనపరిషత్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్,బీసీ విద్యార్థి సంఘం నాయకులు రవీందర్ పాల్గొన్నారు.