•  గెలుపులో భాగస్వామిగా..‘మనీ బ్యాంక్’ అందజేత

వేద న్యూస్, జమ్మికుంట:
కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి వొడితల ప్రణవ్ చిన్నారి చిరు సాయం చేశారు. ప్రచారంలో భాగంగా శనివారం జమ్మికుంట మోతుకులగూడెం కు వచ్చిన అభ్యర్థి ప్రణవ్‌కు ..తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులు అన్నం ప్రవీణ్ కూతురు అన్నం చరిత తన మనీ బ్యాంక్ అందజేశారు. ఈ సందర్భంగా ప్రణవ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. ప్రణవ్ గెలుపులో ‘నేను సైతం’ భాగస్వామిని అనే ఉద్దేశంతో చిన్నారి చరిత తన మనీ బ్యాంక్ ఇచ్చినట్లు కాంగ్రెస్ నాయకులు అన్నం ప్రవీణ్ తెలిపారు.