వేద న్యూస్, వరంగల్ : 

ఎల్ఆర్ఎస్ 25 శాతం రిబెట్ సువర్ణ ఆవకాశం కేవలం రేపు (సోమవారం)ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉన్నందున ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిడబ్ల్యూఎంసీ కమిషనర్ డాక్టర్ ఆశ్విని తానాజీ వాఖడే నేడోక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 31వ తేదీన సెలవు ఉన్నప్పటికీ బల్దియా పరిధిలో ఏర్పాటుచేసిన 10 ఎల్ఆర్ఎస్ హెల్ప్ డెస్క్ లు, పనిచేస్తాయని, ఎల్ఆర్ఎస్ 25 శాతం రిబెట్ తో సోమవారం వరకు మాత్రమే ఉన్న ఈ సువర్ణ ఆవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. హెల్ప్ డెస్క్ లో సందేహాలు నివృత్తి చేసుకొని ఆన్లైన్ ద్వారా రుసుము చెల్లింపులు ప్లాట్ల క్రమబద్దీకరణ చేసుకోవాలని కమిషనర్ కోరారు.