వేద న్యూస్ మాడ్గులపల్లి:
విద్యుత్ ఘాతంతో వలస కార్మికుడు మృతి చెందిన సంఘటన శనివారం రాత్రి మాడ్గులపల్లి మండలం గండ్ర వానిగూడెం గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. ఎస్ఐ కృష్ణయ్య తెలిపిన ప్రకారం సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.చత్తీస్గడ్ రాష్ట్రం, గరియబండ్ జిల్లా,ముంగర్ గ్రామానికి చెందిన హేమసాగర్ పాటిల్ (21) వలస కార్మికుడు మండలం లోని గండ్రవానిగూడెం,గ్రామ శివారులోనీ అనిల్ రెడ్డి నిర్వహిస్తున్న ఇటుక బట్టీ వద్ద పని చేస్తున్నాడు.శనివారం రాత్రి తాను నివాసం ఉంటున్న గదిలో తడిచేతులతో డబుల్ పిన్ హోల్డర్ కు చార్జింగ్ పెడుతుండగా ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగిలి కింద పడిపోగా కుటుంబ సభ్యులు గమనించి ఇటుక బట్టీ యజమానితో కలిసి చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.పరీక్షంచిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు.మృతుని సోదరి సునీత పాటిల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.