• ఏకగ్రీవంగా ఎన్నికైన నేత

వేద న్యూస్, ఎల్కతుర్తి:
బీఆర్ఎస్ పార్టీ ఎల్కతుర్తి మండల అధ్యక్షులుగా పిట్టల మహేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం ఈ ఎన్నిక జరిగింది. హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్, గులాబీ పార్టీ నాయకులు ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

ఎల్కతుర్తి మండల పరిధిలోని సూరారం గ్రామానికి చెందిన పిట్టల మహేందర్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికవడంతో నాయకులు, ఆ గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పిట్టల మహేందర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్ మార్గదర్శనంలో పార్టీని పటిష్టపరచడంతో పాటు ప్రతిపక్షంగా బలమైన పాత్రను పోషిస్తామని తెలిపారు.