వేద న్యూస్, బోయినిపల్లి:

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం తడగొండలో నూతనంగా ప్రతిష్టించిన పోచమ్మ అమ్మవారి కి మంగళవారం రేగూరి శోభారాణి రవీందర్ దంపతులు రూ.20 వేలు విలువ గల మకర తోరణం,గంట అందజేశారు. సాగర్ పంతులు పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారికి అలంకరించారు. అనంతరం భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.ఈకార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, మహిళలు, గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు.