• మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్
  • అక్కనపేట మండల బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో సమావేశం

వేద న్యూస్, హుస్నాబాద్:
ఈ నెల 12న కరీంనగర్ జిల్లాకేంద్రంలోని ఎస్ఆర్ఆర్ గ్రౌండ్స్ లో నిర్వహించే జరిగే పార్లమెంట్ ఎన్నికల శంఖారావ సభను సక్సెస్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీశ్ కుమార్ దిశానిర్దేశం చేశారు. గురువారం ఆయన నియోజకవర్గ పరిధిలోని అక్కన్నపేట మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు.

తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హాజరయ్యే సభను సక్సెస్ చేయాలని పింక్ పార్టీ నేతలను మాజీ ఎమ్మెల్యే కోరారు. అక్కన్నపేట మండలం నుండి అధిక సంఖ్యలో జనాన్ని సభకు తరలించాలని నాయకులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.