- మంత్రి పొన్నం ప్రభాకర్
- హుజురాబాద్ లో లక్ష మెజారిటీ రావాలి
- నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి ప్రణవ్ వొడితల
వేద న్యూస్, జమ్మికుంట:
మే 13 న జరిగే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నీ గెలిపించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. హుజురాబాద్ లోని వెంకటసాయి గార్డెన్స్‌లో గురువారం జరిగిన నియోజకవర్గ కార్యకర్తల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తాను ప్రతి మండల సమావేశానికి వస్తానని చెప్పారు. కార్యకర్తలు బూత్ లలో తిరగాలన్నారు. గ్రామాల్లో కార్యకర్తలే శక్తిమంతులని, ధైర్యంగా పోరాడాలి మెజారిటీ తేవాలని అభ్యర్థించారు. 10 సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ అధికారంలోఉండి ప్రజలకు ఏమీ చేయలేదని విమర్శించారు. ఏ గ్రామంలోకి వెళ్లి అయినా బండి సంజయ్ ఆ గ్రామానికి ఏమైనా చేశారా అని అడగాలని సూచించారు.
నరేంద్ర మోడీ కి తెలంగాణ లో ఓట్లు అడిగే హక్కు ఉందా అని ప్రశ్నించారు. పదేండ్లలో ఒక్క విభజన హామీ అయిన అమలు చేశావా? అని ప్రధానిని అడిగారు.ఇల్లందకుంట రామయాలనికి బండి సంజయ్ ఏం చేశారని ప్రశ్నించారు. బూత్ లలో ఓట్లు తెచ్చుకున్న వారికే ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. తాను రాముడి భక్తుడినని వెల్లడించారు. హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి వొడితల ప్రణవ్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో మీ బూత్ లో మీరే ఇన్ చార్జిలు, మీరే ఎమ్మేల్యేలు, మీరే ఎంపీలు అని కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ప్రతి బూత్ లో మెజారిటీ తీసుకురావాలని కోరారు. ప్రస్తుత ఎంపీ హుజూరాబాద్ కి ఏం చేశారు? అని ప్రశ్నించారు. ఓట్లు అడగడానికి బండి సంజయ్ కి అర్హత ఉందా..?అని అడిగారు. కమలాపూర్ బ్రిడ్జి ఇన్ని సంవత్సరాల నుండి ఎందుకు మంజూరు చేయలేదు? అని నిలదీశారు. ఈ నెల రోజులు కష్టపడి కరీంనగర్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. 7 నియోజకవర్గాల్లో హుజూరాబాద్ లో లక్ష ఓట్ల మెజారిటీ వచ్చేలా కృషి చేయాలని కోరారు.