వేద న్యూస్, ఎలిగేడు:
ఎలిగేడు మండల పరిధిలోని లాలపల్లి గ్రామంలో కొలువైన మల్లిఖార్జున స్వామి వారి ఉత్సవాలను ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆలయ కమిటీ చైర్మన్ గుర్రం మల్లారెడ్డి తెలిపారు. 14న సాయంత్రం 6 గంటలకు దిష్టికుంభ కార్యక్రమం ఉంటుందని, 15న ఉదయం 11 గంటలకు లగ్నపట్న కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నెల 17న ఉదయం 11 గంటలకు అగ్ని గుండాలు, నాగవెల్లి పట్నం కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. భక్తులు ఈ ఉత్సవాలలో అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆలయ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి శుక్రవారం కోరారు.