- హాజరైన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట
- అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు
వేద న్యూస్, ఎలిగేడు:
పెద్దపెల్లి జిల్లా ఎలిగేడు మండల పరిధిలోని లాలపల్లి గ్రామంలో కొలువైన మల్లి ఖార్జున స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగా వైభవంగా జరిగాయి. బుధవారం జరిగిన అగ్ని గుండాలు, నాగవెల్లి పట్నం కార్యక్రమాలతో ఉత్సవాలు ముగిశాయి. ఈ నెల 14న ప్రారంభమైన ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాలలో ఒగ్గు పూజారుల నృత్యాలు అందరినీ అలరించాయి.
కార్యక్రమంలో గ్రామ ప్రజలు బోనాలు చేసి మల్లికార్జున స్వామికి నైవేద్యం సమర్పించారు. మల్లిఖార్జున స్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
ఈ ఉత్సవాలకు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు హాజరై..స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గుర్రం మల్లారెడ్డి, సామ రాజేశ్వర్ రెడ్డి, బద్దం మల్లారెడ్డి, పెద్ది రాజేశం, ఏలేటి మల్లారెడ్డి, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ సింగిరెడ్డి ఎల్లవా, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, మైపాల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.