• అందరూ ఆహ్వానితులే
  • ప్రొప్రైటర్ పాశం రాజు
  • ఆయిల్, మసాలా లేని చక్కటి ఫుడ్ ను ఆస్వాదించాలని ఫుడ్ లవర్స్‌కు పిలుపు

వేద న్యూస్, తొర్రూరు:

ఆయిల్, మసాలా లేకుండా..తాజా, సహజసిద్ధమైన, నాణ్యమైన ఆహారం తీసుకోవాలనుకునే భోజన ప్రియులు, ప్రజలకు శుభవార్త.. మన పెద్దవాళ్లు, తాత ముత్తాతలు ‘‘చద్దన్నం’’ తిని ఎలాంటి అనారోగ్యాలు లేకుండా నూరు, నూటఇరవై ఏండ్లు బతికిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ  క్రమంలోనే అటువంటి  చక్కటి నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు.

తొర్రూరు పట్టణంలో చక్కటి ఆహార ఔషధం అందించేందుకు నిర్వాహకుడు పాశం రాజు సమాయత్తమయ్యారు. ఈ నెల 10న (సోమవారం) ‘‘మన చద్దన్నం’ ఫ్రాంచైజ్ ను ప్రారంభించనున్నట్టు రాజు పేర్కొన్నారు.

పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షురాలు, పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి హనుమాండ్ల ఝాన్సీరెడ్డి ల చేతుల మీదుగా సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో  ‘‘మన చద్దన్నం’ గ్రాండ్ ఓపెనింగ్ చేయనున్నట్టు వెల్లడించారు. 

మసీదు ఎదురుగా ఎస్బీఐ బ్యాంక్ పక్కన తొర్రూరు పట్టణంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి పుర ప్రముఖులు, ప్రజలు, శ్రేయోభిలాషులు అందరూ అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాజు కోరారు. 

స్వచ్ఛమైన ఆర్గానికి నేచురల్ ఫుడ్ ను ప్రజలకు అందించే లక్ష్యంతో ముందుకెళ్లనున్నట్టు రాజు తెలిపారు. తమ ఫుడ్ స్టాల్ లో నేచురల్ ఆహార పదార్థాలు లభిస్తాయని చెప్పారు. జొన్న, రాగి, మిల్లెట్ చద్దన్నం, మిల్లెట్ పొంగల్స్, జావ, గంజి, మల్టీగ్రేన్ ఇమ్యూనిటీ బూస్టర్, అవిసె గింజెలు, నువ్వులు, పల్లి, తాటి బెల్లటం, సగ్గుబియ్యం, ఓట్స్, అంజీర, ఖర్జూర పండ్లు మొదలైనవి లభిస్తాయని వివరించారు.