వేద న్యూస్, తొర్రూరు:

‘‘మన చద్దన్నం’’కు మస్తు గిరాకీ వచ్చిందండోయ్.. ప్రారంభమైన రెండు గంటల్లోనే ఫుడ్ మొత్తం అయిపోయింది. ఆయిల్, మసాలా లేకుండా..తాజా, సహజసిద్ధమైన, నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యంగా సోమవారం ప్రారంభమైన ‘మన చద్దన్నం’ ఫుడ్ స్టాల్ కు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. 

తొర్రూరు పట్టణంలో ఎస్బీఐ బ్యాంకు పక్కన అందరికీ అందుబాటులో ఏర్పాటు చేసిన ఈ ఫుడ్ స్టాల్ ను  పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పెదగాని సోమన్న ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. 

ప్రజలకు చక్కటి  ఆహారాన్ని అందించి.. వ్యాపార పరంగానూ నిర్వాహకులు రాణించాలని సోమన్న ఈ సందర్భంగా ఆకాంక్షించారు. అనంతరం నిర్వాహకులు పాశం రాజు దంపతులు కాంగ్రెస్ నాయకుడిని శాలువాతో ఘనంగా సత్కరించారు. 

మన పెద్దవాళ్లు, తాత ముత్తాతలు ‘‘చద్దన్నం’’ తిని ఎలాంటి అనారోగ్యాలు లేకుండా నూరు, నూటఇరవై ఏండ్లు బతికిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ  క్రమంలోనే అటువంటి  చక్కటి నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించడమే లక్ష్యమని ఫుడ్ స్టాల్ ప్రొప్రైటర్  పాశం రాజు పేర్కొన్నారు.