వేద న్యూస్, వరంగల్:

వరంగల్ ములుగు రోడ్డులోని మారుతి షోరూం లో మారుతీ సుజుకీ స్విఫ్ట్ ఫోర్త్ జనరేషన్ కారును డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పుప్పాల శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం మారుతి షోరూం జనరల్ మేనేజర్ కళ్యాణ్ మాట్లాడుతూ స్విఫ్ట్ లో న్యూ డిజైన్ తో కొత్త కారును దేశవ్యాప్తంగా ప్రారంభిస్తున్నామని అందులో భాగంగానే వరంగల్ లో కూడా ప్రారంభించామని అన్నారు. ఈ కారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందుబాటులో ఉంటుందని తెలిపారు. రూ.8 లక్షల నుంచి పది లక్షల పైన ఈ కారు ఉంటుందని అన్నారు. ఇందులో ఆటో గేర్ షిఫ్ట్ కూడా ఉందని పర్ఫామెన్స్ బెటర్ గా ఉంటుందని అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 షో రూమ్లు ఉన్నాయని తెలంగాణ వ్యాప్తంగా 123 షోరూమ్లతో సర్వీస్ కూడా అందుబాటులో ఉంచామని ఉన్నారు. స్పాట్ బుకింగ్ కూడా చేసుకోవచ్చని, బుక్ చేసుకున్న తర్వాత నాలుగు వారాలలో అందజేస్తామని తెలిపారు. జీరో డౌన్ పేమెంట్ ఇచ్చి ఆల్ బ్యాంక్ అందుబాటులో ఉన్నట్లు వివరించారు.