oplus_0
  • 24 ఏళ్ల రాజకీయ జీవితంలో కార్మికులే             నా కోట్లాది ఆస్తి 
  • రైతులు, కార్మికుల సేవలో నా జన్మ ధన్యమైంది
  •  కరీంనగర్ డిసిసిబి వైస్ చైర్మన్ పింగళి రమేష్ 

వేద న్యూస్, జమ్మికుంట:

మేడే అంటేనే జమ్మికుంట.. జమ్మికుంట అంటేనే మేడే అని కరీంనగర్ డీసీసీబీ బ్యాంక్ వైస్ చైర్మన్ పింగళి రమేష్ అన్నారు. బుధవారం మే డే సందర్భంగా జమ్మికుంట పట్టణంలోని కూరగాయల మార్కెట్ లో వేడుకలను హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వొల్లాల శ్రీనివాస్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సంబురాలకు తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సామ్రాజ్యం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

పాత వ్యవసాయ మార్కెట్ ఏరియా నుంచి లేబర్ ఆఫీసు వరకు 500 మందితో ర్యాలీ నిర్వహించిన అనంతరం మేడే సందర్భంగా జెండాను పింగళి రమేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ఎన్నికల నియమావళి వల్ల మేడే వేడుకలను సింపుల్ గా నిర్వహించినట్టు స్పష్టం చేశారు.

కార్మిక సోదరీ సోదరీమణులు ఈసారి కి వేడుకల్లో మజ్జిగ ప్యాకెట్లతో సర్దుకోవాలని సూచించారు. గతంలో అంబేద్కర్ చౌక్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం అక్కడి నుంచి.. వయా గాంధీ చౌక్ ..ఆఫీసుకు చేరుకొని అట్టహాసంగా వేడుకలు చేపట్టి జెండాను ఎగురవేసేదని గుర్తు చేశారు.

జమ్మికుంట మేడే వేడుకలను చూసేందుకు రాష్ట్రవ్యాప్తంగా టీవీలు ఇటువైపు చూసేవని చెప్పారు. నిరుడు కూడా వర్షం వల్ల వేడుకలు సాధారణంగా చేసినట్టు తెలిపారు. తన 24 ఏళ్ల రాజకీయ జీవితంలో కార్మికులే తన పెట్టుబడి అని వెల్లడించారు.

భవిష్యత్తులోనూ రైతులు, కార్మికుల పక్షానే ఉంటానని పేర్కొన్నారు. మేడే చివరి వారంలో అవకాశం ఉంటే ర్యాలీ నిర్వహించనున్నట్టు తెలిపారు. గతంలో ఎంతో ఘనంగా డప్పులు, దరువులతో భారీ ర్యాలీ చేపట్టి అట్టహాసంగా మేడే సంబురాలను చేసినట్టు పేర్కొన్నారు.

తాను కార్మిక సంఘానికి 14 ఏళ్లు అధ్యక్షుడిగా ఉండి సేవలందించాలని, రైతులు, కార్మికుల సేవలో తన జన్మ ధన్యమైనట్లు చెప్పారు. కార్మికులే తన కోట్లాది ఆస్తి అని పేర్కొన్నారు.

అనంతరం ‘కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి’, ప్రపంచ కార్మికులారా ఏకంకండి’, ‘పోరాడే వారిదే ఎర్రజెండా’ అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

 ఈ మేడే వేడుకల్లో 22 బ్యాచ్ ల పెద్దమనుషులు, హమాలీ వర్కర్లు, దడ్వాయి, సాటేసడెం, మార్కెట్ కూలీలు, ఆడకూలీ లు, మిల్లర్స్, వర్కర్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు.