వేద న్యూస్, కరీంనగర్ :
కరీంనగర్ జిల్లాలోని మెడికల్ ఏజేన్సీ నిర్వాహకులు సిబిసిఐడి విచారణ జరిపించాలాని డిమాండ్ చేస్తూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందజేశారు.అనంతరం ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బావండ్లపల్లి యుగేందర్ మాట్లాడుతూ ఉత్తర తెలంగాణ జిల్లా అయినా కరీంనగర్ కేంద్రంగా జోరుగా సాగుతున్న మందు బిళ్ళల దందా ను అరికట్టాలని,నకీల మందు బిళ్ళల తయారీ ఫార్మసీ కంపనీయాజమాన్యాల పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ తో సన్నిహిత సంబంధాలు ఉండటం మూలంగానే ఫార్మసీ ఏజేన్సీ నిర్వాహకుల మేంటేన్ చేయటం మూలంగానే సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహారించారని ప్రతిఫలంగా నెలకోసారి ముడుపులు ముట్టాయన్నారు ఇదే అదునుగా భావించిన ఫార్మసీ ఏజేన్సీ నిర్వాహకులు నకీలీ ముందు బిళ్ళల దందా కొనసాగించారన్నారు.మందు బిళ్లల ఉత్పత్తులలో నాణ్యత ప్రమాణాలు ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించాలన్నారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే షెడ్యూల్ హెచ్,హెచ్ 1 మందు బిళ్ళలను అమ్మటానికి వీల్లేదన్నారు.దేశంలో ఫార్మా రంగానికి ఉత్తర తెలంగాణ జిల్లా అయిన కీలక కేంద్రంగా గుర్తింపు పొందినా న్నారు సంబంధిత మందుబిళ్ళల తయారికీ ముడి సరుకు రాష్ట్రంలో ఎక్కువ మోత్తంలో ఉండటాన్ని అదునుగా భావించిన ఫార్మసీ కంపెనీ లు తేలంగాణ రాష్ట్రంలో కన్నేసారన్నారు మందు బిళ్ళలు నాణ్యత ప్రమాణాలు పర్యవేక్షణ లోపించటం డ్రగ్ ఇన్స్పెక్టరల నిర్లక్ష్యం మూలంగానే నకీలీ మందుల తయారీ జరుగుతుందాన్నారు. ఈ తతాంగం చాలా యేళ్ళుగా డ్రగ్ ఇన్స్పెక్టర్ ల కనుసన్నల్లో నకీలి మందు బిళ్ళల రాకెట్ జరిగిందన్నారు ఒకవైపు కేంద్ర ప్రభుత్వం మందు బిళ్ళల ధరలు పేంచి సామాన్య మధ్యతరగతి ప్రజలును వైద్యానికి దూరం చేస్తూందన్నారు.ఇకనైన మందు బిళ్ళలు అధికార యాంత్రంగoసరైన పర్యవేక్షణ జరుపలాన్నారు. జిల్లా కేంద్రంలో మెడికల్ ఏజేన్సీ నిర్వాహకులపై సిబిసిఐడి విచారణ జరిపించాలన్నారు. లేని యేడల అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు సురేశ్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.