- రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ
వేద న్యూస్, టేక్మాల్ :
మెదక్ జిల్లా ల పంచాయత్ రాజ్ , ఆర్ బి శాఖల ఇంజినీరింగ్ అధికారులతో సంగారెడ్డి లోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సంగారెడ్డి, మెదక్ జిల్లాలలో విస్తరించి ఉన్న అందోల్ నియోజక వర్గ పరిధిలో పంచాయత్ రాజ్ శాఖ అద్వర్యంలో చేపట్టుతున్న రోడ్ల నిర్మాణ పనులు , ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్ల మరమ్మ తుల పనులు శరవేగంగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు .
అందోల్ నియోజక వర్గంలో పంచాయత్ రాజ్ శాఖ అద్వర్యం లో గ్రామీణ ఉపాధి హామీ పథకం లోచేస్తున్న రోడ్ల నిర్మాణ , మరమ్మత్తుల పనులు , కొత్తగా నిర్మిస్తున్న అంగన్వాడీ భవనాల నిర్మాణ పనులు , వివిధ పాఠశాలలలో నిర్మిస్తున్న టాయిలెట్స్ బ్లాక్స్ ల నిర్మాణ పనులపై చర్చించారు.
నియోజక వర్గం లో చేపట్టిన మండల కేంద్రాల నుండి గ్రామాలకు వెళ్లే కనెక్టింగ్ రోడ్స్ ల పనులు త్వరగా పూర్తి చేయాలనీ మంత్రి దామోదర్ రాజనర్సింహా ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు .
అనంతరం సంగారెడ్డి జిల్లా రహదారుల భవనాల శాఖ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు . ఈ సమీక్షలో గార్లపల్లి – అజ్జమర్రి బ్రిడ్జి నిర్మాణ పనుల పురోగతి పై చర్చించారు. ఈ సమీక్షలో పి ఆర్ డిపార్ట్మెంట్ ఇంజినీరింగ్ శాఖ అధికారులు ఎస్ ఇ జగదీశ్వర్ ,ఇ ఇ నర్శిములు , ప్రభాకర్ , డై డి డి కృష్ణ , ఇతర ఇంజనీరింగ్ అధికారులు , ఆర్ బి శాఖ అధికారులు ఇఇ నర్శిములు, డిఇ రవీందర్ లు పాల్గోన్నారు .