వేద న్యూస్, మరిపెడ:
డోర్నకల్ నియోజకవర్గ కేంద్రమైన మరిపెడలో రూ.36కోట్ల వ్యయంతో వంద పడకల ఆసుపత్రిని నెలకొల్పటం లో ఎమ్మేల్యే డీఎస్ రెడ్యానాయక్ గారి కృషి ఫలించింది. ఈ బృహత్కర్యానికి రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు పాల్గొన్న బహిరంగ సభ జయప్రదానికి కృషి చేసిన జిల్లా గ్రంథాలయం చైర్మన్ నవీన్ రావు గారిని బిచ్ రాజుపల్లి లో శుక్రవారం పట్టణ కేంద్రానికి చెందిన పార్టీ శ్రేణులు అభిమానులు కలుసుకుని శాలువతో సన్మానం చేసి పుష్ప గుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా గుడిపూడి నవీన్ రావు మాట్లాడారు. సభ జయప్రదం చేసిన నియోజక వర్గ పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిదులకు కృతఙ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పానుగోతు వెంకన్న, బానొతు కిషన్,
బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జి గోల్కొండ వెంకన్నతదితరులు పాల్గొన్నారు