– కేటీఆర్ పర్యటనతో శ్రేణుల్లో ఉత్సాహం
– దాసరిని గెలిపించుకోవాలని ప్రజలకు మంత్రి పిలుపు
వేద న్యూస్, ఎలిగేడు:
పెద్దపల్లి జిల్లాలో కేటీఆర్ పర్యటన ఆనందోత్సాహాల మధ్య సాగింది. సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ.. ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సంక్షేమ పథకాలను జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు అడ్డగోలు రీతిలో మాట్లాడుతున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ వస్తే మూడు గంటలు కరెంటు మాత్రమే వస్తుందని, బీజేపీ వస్తే ఉన్న పథకాలు నిర్వీర్యం అవుతాయని కేటీఆర్ ఎద్దేవా చేశారు. పెద్దపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా దాసరి మనోహర్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రజలను కేటీఆర్ కోరారు.